తొలగిన అవమానము

జోసెఫ్ అవినాష్
04 Aug 2026
సామాన్య 18వ బుధవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 15:21-28
కొన్నిసార్లు అనుకోకుండా అపనిందలు వస్తాయి. వాటివల్ల అవమానపర్చబడతాము. అపనిందలు తొలగిన తరువాత అంతా మంచి అవుతారు.అపనిందలు వేసేవారు ఎవరిని అవమానపరుస్తున్నాము వారి యొక్క వ్యక్తిత్వము ఎలాంటిది అని తలంచరు.మిర్యాము కూడా మోషే విషయంలో అపనిందలు వేసి అబాసుపాలు అయింది. దేవుడు తప్పుపట్టరాదు అని మంచి సాక్ష్యము యిచ్చారు. మోషే నా యిల్లంతటిలో నమ్మకస్థుడు,తన తమ్ముని విషయమై దేవుడు అంతగొప్ప సాక్ష్యం ఇచ్చారు.అది చాలదా, తన పొరపాటు గ్రహించలేనందున కుష్ఠురోగి అయి అబాసుపాలు అయింది. ఏడు రోజులు పాళెమునకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
మనిషి జీవితం విశ్వాసము మీద ఆధారపడి ఉంది. మనిషి ఒక ప్రాంతమునకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు,నేను ఆ ప్రదేశమును చేరతాను అనే విశ్వాసముతో తన ప్రయాణాన్ని సాగిస్తాడు.అమ్మ అన్నము పెట్టినప్పుడు మా అమ్మ నాకు విషము పెట్టదు అనే విశ్వాసముతో కుమారుడు సందేహము లేకుండా ఆహారము భుజిస్తాడు.ఎందుకనగా నన్ను నా తల్లి 9 నెలలుగా తన గర్భమందు మొసిన అమ్మ నాకు విషము పెట్టదు అని కుమారుడు తల్లిని విశ్వసిస్తాడు.అదే విధముగా ఈనాటి సువార్తా పఠనములో కననీయ స్త్రీ క్రీస్తును విశ్వసించినది,ప్రభును నమ్మినది ఎందుకనగా దయ్యముపట్టి బాధపడుచున్న తన కుమార్తెను బాగుచేస్తారని, స్వస్థతపరుస్తారని.ప్రభు కాలంలో యూదులు విశ్వాసం కోల్పోయి తామే గొప్పవారం, దేవుని సంతతి అని ఇతరులు కుక్కలు అన్న రీతిలో ఉండేవారు.వారిలో దేవుని శక్తికంటే తమ శక్తిపైనే ఎక్కువ విశ్వాసం ఉండేది.కననీయ స్త్రీ విశ్వాసం ద్వారా దేవుడు వారి కళ్ళు తెరిపిస్తున్నారు. దేవుని మందు విశ్వాసం ఉంచి జీవిండము అన్నికంటే మేలైనది.
