"క్రీస్తు పిలుపును ధైర్యంగా ఆలకించండి" – ఈక్వెడార్ యువతకు పోప్ సందేశం

జోసెఫ్ అవినాష్

04 Aug 2026

2026 ఆగస్టు 2న ఈక్వెడార్‌లో జరిగిన 7వ జాతీయ యువజన మహాసభ సందర్భంగా పోప్ లియో XIV వీడియో సందేశం ద్వారా యువతను ఉద్దేశించి మాట్లాడారు."ధైర్యంగా ఉండండి; నేను లోకాన్ని జయించాను" (యోహాను 16:33) అనే అంశాన్ని ప్రస్తావిస్తూ,క్రీస్తు పిలుపును ధైర్యంగా ఆలకించి ఆయనను విశ్వాసంతో అనుసరించాలని యువతను ప్రోత్సహించారు.క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధమే జీవితానికి నిజమైన ఆనందాన్ని,ఆశను ప్రసాదిస్తుందని పేర్కొంటూ,యువత తమ జీవన సాక్ష్యంతో దేవుని ప్రేమ, కరుణ,శాంతిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.అలాగే మరియమాతను ఆదర్శంగా తీసుకొని దేవుని చిత్తాన్ని సంతోషంతో నెరవేర్చే శిష్యులుగా జీవించాలని వారిని ఆశీర్వదించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN