పునీత జాన్ మరియ వియాన్నీ పండుగ సందర్భంగా

ఈలి ఫ్రాన్సిస్ జేవియర్,అనంతపురం

03 Aug 2026

మరియ వియాన్నీ!
ఓ గురుశ్రేష్టుడా!
వందనమయ్యా!
మాకై ప్రార్థించయ్యా

పాపసంకీర్తనాలు
పరంపరగ విన్నట్టి
క్షమాపణ అపోస్తలుడవు
మా ఆత్మల మోక్షము చేర్చు

ఆర్స్ రోగం కుదిర్చిన
వైద్యుడు నీవు
మా గురువులను సంఘాలను
చక్కదిద్ది ఒడ్డుకు చేర్చు

సత్ప్రసాద ప్రభువు ముందు
గంటల తరబడి కూర్చుని
ప్రార్థించిన భక్తుడవు
ఆ భక్తిని మాకు నేర్పించు

సాతానును నేరుగా
ఎదుర్కొన్న ధీరుడవు
శోధనలను జయించే
నేర్పు మాకు నేర్పించు

మరియ వియాన్నీ!
యోహాను మరియ వియాన్నీ!
గురు శ్రేష్టుడా!
మహా గురుశ్రేష్టుడా!
వందనమయ్యా!
మాకై ప్రార్థించయ్యా!
ఎడతెగక ప్రార్థించయ్యా!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN