117 సార్లు రక్తదానం చేసిన కన్యా స్త్రీ... దేశంలోనే అరుదైన సేవా రికార్డు

జోసెఫ్ అవినాష్
03 Aug 2026
భారతదేశంలో ఒక మహిళగా అత్యధిక సార్లు రక్తదానం చేసిన ఘనతను సిస్టర్ జయా ఆంటో మంగళత్ సాధించారు. కేరళకు చెందిన గుడ్ సమారిటన్ సభకు చెందిన సిస్టర్ 2024 మార్చిలో 117వ సారి రక్తదానం చేసి జాతీయ రికార్డును నెలకొల్పారు.ఈ విశేష సేవకు ఆమె పేరు టాలెంట్ రికార్డ్ బుక్లో నమోదైంది. సిస్టర్ జయా తన యవ్వనంలోనే రక్తదానం ప్రారంభించి,దశాబ్దాలుగా నిరంతరం ఈ సేవను కొనసాగిస్తున్నారు. "రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే ప్రేమదానం.మన రక్తం ద్వారా మరొకరికి జీవితం లభిస్తే, అంతకంటే గొప్ప ఆనందం లేదు"అని ఆమె తెలిపారు.ఆమె సేవ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి,స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి కొత్త ఊపునిస్తోంది.
