క్రీస్తే మన హృదయపు నిజమైన ఆకలిని తీర్చేవాడు – పోప్
జోసెఫ్ అవినాష్
03 Aug 2026
మనిషికి కేవలం ఆహారం మాత్రమే కాదు,ప్రేమ, ఆశ,సత్యం, దేవుని సాన్నిధ్యం కూడా అవసరమని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ చెప్పారు.ఐదు రొట్టెలు, రెండు చేపల అద్భుతాన్ని గుర్తుచేస్తూ,మన వద్ద ఉన్నది ఎంత చిన్నదైనా దేవునికి అర్పిస్తే అది అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుందని వివరించారు.నిజమైన తృప్తి,జీవితానికి పరిపూర్ణత క్రీస్తులోనే లభిస్తుందని విశ్వాసులకు పిలుపునిచ్చారు.అలాగే ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన పోప్,యుద్ధాలు,హింసలు,వలసదారుల బాధలు ముగిసి ప్రతి మనిషి గౌరవంతో జీవించే పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు.దేవుని కరుణను స్వీకరించి పునరుద్ధరించబడిన జీవితాన్ని గడపాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించారు.
