ఉన్న దాంట్లో పదిమందికి పంచుతూ జీవిద్దాం

జోసెఫ్ అవినాష్

02 Aug 2026

సామాన్య 18వ సోమవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 14:13-21
కోటి విద్యలు కూటి కొరకే అన్నారు.మన కనీస అవసరాలు ఈ కోవ క్రిందకు వస్తాయి.మానవ జీవితం కేవలం శారీరక సుఖం కోసమేనా? భక్తి కేవలం భుక్తి కోసమేనా? మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా ఫర్వాలేదా? అనే ఆలోచనలు కొన్నిసార్లు మనలను ఎంతో బాధకు,నిరాశకు గురిచేస్తాయి. నాటి సమాజ పరిస్థితిని గమనించినట్లయితే మానవుని ఆశకు హద్దులు,అవదులు లేకుండా పోతుంది.స్వార్ధం రాజ్యమేలుతుంది.తన తోటివారితో ఆనందాన్ని, ఆహారమును పంచుకోవాలి. ప్రపంచంలో కోట్లాదిమంది ఆహారము లేక ఆకలితో ఆకలి చావులకు గురవుతున్నారు. అంటే ఆహారము లేక కాదు ఇతరులతో పంచుకోవాలి అనే స్వభావం లేకపోవటము అని గమనించాలి.ఈనాటి సువార్తలో యేసు ఒక మామూలు మనిషి తినే మధ్యాహ్న భోజనమును ఒక గొప్ప జన సమూహమునకు చాలినంత ఆహారము పెట్టుటకు ఉపయోగించాడు. ఒకరి త్యాగం వేలమందికి ఆహారమైనది.దివ్యసత్ప్రసాదము ప్రభుని సాన్నిధ్యం. పూర్వవేదంలో మేఘముల ద్వారా తన ఉనికిని దేవుడు ప్రదర్శించాడు.ఈనాడు తన శరీర,రక్తముల ద్వారా అనగా దివ్యసత్ప్రసాదం ద్వారా మన మధ్యలో ఉన్నారు.యేసు తన దివ్యశరీర,రక్తాన్ని మనకు దివ్య భోజనంగా ప్రసాదించాడు. కనుక మనం ప్రభు శరీర, రక్తములను భక్తితో తరచుగా స్వీకరించాలి.ఆయన జీవాన్ని మనలో పంచుకొని ఆయనతో కలసి జీవిస్తూ అంతిమ దినమున ఆయనతో పునరుత్థానం కావాలి.దైవభక్తి, సోదర భావం,అనాధలు, అభాగ్యులు,పేదల యెడల దయ,జాలి కలిగి మనకు ఉన్న దాంట్లో పదిమందికి పంచుతూ జీవిద్దాం.ఆకలితో అలమటించే పేదలతో మనం పంచుకున్న సంపదలు పుణ్యం రూపంలో మన వెంట వస్తాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN