వలసదారుల పట్ల కరుణ, చట్టం రెండూ కలిసి నడవాలి: పోప్
జోసెఫ్ అవినాష్
30 Jul 2026
జూలై 29, 2026న NBC Newsకు ఇచ్చిన తన తొలి అమెరికన్ టెలివిజన్ ఇంటర్వ్యూలో పోప్ లియో XIV,వలసల సమస్యను కరుణతో పాటు న్యాయబద్ధమైన దృక్పథంతో చూడాలని పిలుపునిచ్చారు.ప్రతి దేశానికి తన సరిహద్దులను రక్షించుకునే హక్కు ఉన్నప్పటికీ,వలసదారుల మానవ గౌరవాన్ని ఎన్నడూ విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు.యుద్ధాలు,పేదరికం,హింసల కారణంగా స్వదేశాలను విడిచి వెళ్లే ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని,వారికి గౌరవం,దయ,న్యాయం చూపడం క్రైస్తవ విశ్వాసం కోరుకునేదేనని పేర్కొన్నారు.రాజకీయ ప్రయోజనాల కంటే ప్రతి మనిషి యొక్క అంతర్లీన గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలని,వలసల సమస్యకు మానవత్వం,బాధ్యత, సంభాషణలతో కూడిన శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.
