మెడ్జుగోర్జే మరియతల్లి పుణ్యక్షేత్రంపై విధ్వంసక దాడి

జోసెఫ్ అవినాష్
29 Jul 2026
జూలై 28 తెల్లవారుజామున మెడ్జుగోర్జేలోని పవిత్ర మరియమాత పుణ్యక్షేత్రం విధ్వంసక చర్యకు గురైంది.దుండగులు మరియమాత స్వరూపాన్ని అవమానపరుస్తూ దానిపై నల్లరంగు పూయడమే కాకుండా, అసభ్యకరమైన పదాలు రాసి,సెయింట్ జేమ్స్ దేవాలయ ప్రాంగణంలోని బహిరంగ బలిపీఠానికి నిప్పంటించారు.ఈ ఘటన కతోలిక విశ్వాసులను తీవ్రంగా కలచివేసింది.అయితే ఈ దుర్ఘటనకు ప్రతీకారంతో కాకుండా,క్రీస్తు బోధించిన క్షమ, ప్రార్థన,ఉపవాసం అనే సువార్త మార్గంలోనే స్పందించాలని మెడ్జుగోర్జే విచారణ గురువులు, విశ్వాసులను ఆహ్వానించారు.పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు,దివ్యబలిపూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలియజేస్తూ,ఈ సంఘటన వల్ల విశ్వాసం ఏమాత్రం క్షీణించదని,దేవునిపై నమ్మకంతో మరింత ఏకమనస్కులై ప్రార్థనలో నిలవాలని పిలుపునిచ్చారు.
