మానవ గౌరవాన్ని కాపాడేలా సాంకేతికతను వినియోగించండి: పోప్
జోసెఫ్ అవినాష్
29 Jul 2026
జూలై 26,27వ తేదీలలో చిలీలో జరిగిన ఏడవ అంతర్జాతీయ శ్రీసభ సమాచార మాధ్యమాల సదస్సుకు పంపిన సందేశంలో పోప్ లియో XIV,కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సాంకేతికత మానవునిపై ఆధిపత్యం చెలాయించేదిగా కాకుండా,సత్యానికి,సామాన్య మేలుకు,మానవ గౌరవానికి సేవ చేసేదిగా ఉండాలని పిలుపునిచ్చారు.AI వల్ల ఎదురయ్యే సవాళ్లను వివేకంతో, బాధ్యతతో ఎదుర్కొంటూ,ప్రజల మధ్య విశ్వాసాన్ని, ఐక్యతను పెంపొందించే విధంగా శ్రీసభ తన సమాచార సేవను కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కార్డినల్ ఫెర్నాండో చోమాలి,సోషల్ మీడియా కూడా మానవ జీవితంలోని భావోద్వేగాలు,బంధాలు, సంఘర్షణలు ప్రతిబింబించే వేదికేనని పేర్కొంటూ,కమ్యూనికేషన్ ఎల్లప్పుడూ సత్యం,మంచితనం, సౌందర్యం, ప్రయోజనం అనే విలువలపై ఆధారపడాలని, కృత్రిమ మేధస్సు ఎప్పటికీ మానవ గౌరవానికి సేవ చేసే సాధనంగా మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.
