తీర్చి దిద్దుకొనుట తెగని పోరు!.

డా. కల్లూరి ఆనందరావు
28 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
........................................................
గండ శిలల మధ్య గలగలా ప్రవహించు
కొండవాగు జోరు! గొప్ప హోరు!
విరిగిన బ్రతుకులను విలువైన చదువుతో
తీర్చి దిద్దుకొనుట తెగని పోరు!.
