భారత యువత ధైర్యాన్ని ప్రశంసించిన బిషప్ రాయరాల విజయకుమార్

జోసెఫ్ అవినాష్
28 Jul 2026
భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య,సామాజిక సేవా కమిషన్ మరియు తెలుగు కతోలిక యువజన ఉద్యమం (TCYM) అధ్యక్షులు శ్రీకాకుళం పీఠాధిపతులు మహా.ఘన.శ్రీ రాయరాల విజయకుమార్ గారు NEET-UG మరియు ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకులు,పరీక్షల అవకతవకలను అరికట్టాలని కోరుతూ,న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో శాంతియుతంగా తమ హక్కుల కోసం గళమెత్తిన భారత యువత ధైర్యసాహసాలను,ఆశావహ దృక్పథాన్ని అభినందించారు.ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, అహింసా మార్గంలో న్యాయం కోసం యువత ముందుకు రావడం దేశ భవిష్యత్తుకు ఆశాకిరణమని ఆయన పేర్కొన్నారు.యువత సమాజ నిర్మాణంలో సత్యం,న్యాయం, బాధ్యతాయుత సేవ అనే విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారి కోసం ప్రార్థిస్తూ, దేశంలో శాంతి,న్యాయం,సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
