సంగీతంతో శాంతికి వంతెన వేయనున్న పోప్ లియో XIV
జోసెఫ్ అవినాష్
28 Jul 2026
ప్రపంచంలోని యుద్ధాలు,హింస,సంక్షోభాల వల్ల బాధపడుతున్న దేశాల నుండి వచ్చిన చిన్నారులు, యువతతో కూడిన అంతర్జాతీయ గానబృందం జూలై 29న బోర్గో లౌదాతో సీలో శాంతి కోసం ప్రత్యేక సంగీత ప్రార్థనను నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో విశ్వ కాపరి పోప్ లియో XIV మరియు ప్రముఖ ఇటాలియన్ గాయకుడు Andrea Bocelli పాల్గొంటారు.సంగీతం భాష,జాతి,దేశాల సరిహద్దులను దాటి మానవ హృదయాలను ఏకం చేసే శాంతి సందేశమని ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటనున్నారు.యుద్ధాల వల్ల బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రార్థిస్తూ,సమాధానం,సోదరభావం,ఆశలతో నిండిన భవిష్యత్తును నిర్మించాలని ఈ శాంతి గానార్చన ప్రపంచ ప్రజలకు పిలుపునిస్తోంది.
