పరిశుద్ధ దివ్యబలిపూజ మన ఐక్యతకు మూలాధారం కావాలి - పోప్

జోసెఫ్ అవినాష్
27 Jul 2026
ఇండోనేషియాలోని జకార్తాలో ఆసియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య 12వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న విషయం విధితమే.ఈ సమావేశాలలో పాల్గొంటున్న పీఠాధిపతులను ఉద్దేశించి పోప్ లియో XIV మాట్లాడుతూ, పరిశుద్ధ దివ్యబలిపూజను కేవలం ఆరాధన మాత్రమే కాకుండా,సంఘ ఐక్యతకు,సోదరభావానికి,క్రీస్తు సాక్ష్యజీవితానికి జీవనాధారమని గుర్తుచేశారు.జాతి,భాష, సంస్కృతి వంటి భేదాలు ఉన్నప్పటికీ, ప్రభుని బలిపీఠం చుట్టూ అందరూ ఒకే కుటుంబంగా ఏకమవుతారని ఆయన అన్నారు.పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ద్వారా పీఠాధిపతులు పరస్పర సహకారంతో,ప్రేమతో,వినయంతో ప్రజలను నడిపిస్తూ,సువార్తను ధైర్యంగా ప్రకటించాలని పోప్ ప్రోత్సహించారు.ప్రపంచానికి శాంతి,ఆశ,ఐక్యతను అందించే క్రీస్తు సాక్షులుగా ఆసియా శ్రీసభ మరింత వెలుగొందాలని ఆయన ఆకాంక్షించారు.
