సముద్రయాన కార్మికుల మృతిపై సీబీసీఐ సంతాపం – తక్షణ కాల్పుల విరమణకు పిలుపు

జోసెఫ్ అవినాష్
22 Jul 2026
ఉక్రెయిన్‌లోని ఒడెసా రేవు నుంచి జూలై 19 సాయంత్రం బయలుదేరిన ‘ఎమ్‌వీ గోల్డెన్ లియో’ (MV Golden Leo) అనే వాణిజ్య కార్గో నౌకపై జరిగిన భీకర దాడిలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొక భారతీయుడి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది.ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ,వాణిజ్య నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర భద్రతకు ముప్పని పేర్కొంది.ఈ విషాద ఘటన నేపథ్యంలో భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI)కి చెందిన Office for Labour and Apostleship of the Sea మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి కాల్పుల విరమణ అమలు చేయాలని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చింది.నిరపరాధ పౌరులు,ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి సేవలందిస్తున్న సముద్రయాన కార్మికుల భద్రతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది.
