ఆసియా శ్రీసభలో సినడాలిటీ అమలుకు కొత్త కార్యాచరణ ప్రణాళిక
.jpg)
జోసెఫ్ అవినాష్
21 Jul 2026
ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ సర్వసభ్య సమావేశాలు జూలై 20న ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆరంభమయ్యాయి.జూలై 26 వరకు జరిగే ఈ సమావేశంలో 120 మందికి పైగా కార్డినల్స్,22 మంది పీఠాధిపతులు పాల్గొని పలు ముఖ్యమైన అంశాలను చర్చించనున్నారు.ముఖ్యంగా
ఆసియా శ్రీసభలో సినడాలిటీ (సహయాత్రికత)ను మరింత సమర్థంగా అమలు చేయడానికి కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రజలతో కలిసి నడవడం,యువత,మహిళలకు ఎక్కువ బాధ్యతలు కల్పించడం,డిజిటల్ మాధ్యమాల ద్వారా సువార్తను విస్తరించడం,ఇతర మతాల వారితో సత్సంబంధాలు పెంపొందించడం,పేదలు మరియు అట్టడుగు వర్గాల పట్ల మరింత శ్రద్ధ చూపించడం వంటి అంశాలకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు.ప్రతి దేశంలోని శ్రీసభ తన పరిస్థితులకు అనుగుణంగా ఈ సహయాత్రికతను ఆచరణలోకి తీసుకురావాలని సమావేశంలో పాలుపంచుకున్న పీఠాధిపతులు పిలుపునిచ్చారు.
