శాంతికి మార్గం నిరాయుధీకరణే – పోప్

జోసెఫ్ అవినాష్

21 Jul 2026

వాటికన్ ప్రచురణ సంస్థ పోప్ లియో XIV రచించిన "Disarmed and Disarming: Peace Is a Gift" (శాంతి ఒక వరం) అనే కొత్త గ్రంథాన్ని విడుదల చేసింది.ఈ గ్రంథంలో పోప్‌గా ఎన్నికైనప్పటి నుంచి శాంతి,నిరాయుధీకరణ,మానవ సౌభ్రాతృత్వం,సంభాషణ,క్షమాపణ వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు,సందేశాలు,ఆలోచనలు సంకలనం చేయబడ్డాయి.ప్రపంచంలో నిజమైన శాంతి ఆయుధాలతో కాదు, హృదయాల మార్పుతో,పరస్పర విశ్వాసంతో,మానవ గౌరవాన్ని కాపాడే చర్యలతోనే సాధ్యమవుతుందని పోప్ లియో XIV ఈ గ్రంథం ద్వారా పునరుద్ఘాటించారు.ద్వేషం, హింస,యుద్ధాల స్థానంలో ప్రేమ,సంభాషణ,సయోధ్యను పెంపొందించాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN