శాంతి కోసం ప్రార్థిద్దాం... యుద్ధంలో బాధపడుతున్న వారిని మరువవద్దు: పోప్

జోసెఫ్ అవినాష్

20 Jul 2026

కాస్టెల్ గాండోల్ఫోలో ఆదివారం ఏంజెలస్ ప్రార్థన అనంతరం పోప్ లియో XIV ప్రపంచంలోని యుద్ధాలు,హింసలతో అతలాకుతలమవుతున్న దేశాల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.యుద్ధాల కారణంగా బాధపడుతున్నవారిని, ప్రాణాలు కోల్పోతున్నవారిని ఎప్పటికీ మరువకూడదని ఆయన పిలుపునిచ్చారు.శాంతి కోసం నిరంతర ప్రార్థనలతో పాటు,ప్రతి ఒక్కరూ ఉదారమైన హృదయంతో శాంతి స్థాపనకు కృషి చేయాలని విశ్వాసులకు విజ్ఞప్తి చేశారు.దేవుని ప్రేమ,కరుణ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని కోరుతూ, హింసకు బదులుగా సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని ఆయన సందేశమిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN