తీర్పు కాదు, ప్రేమతో జీవించండి: పోప్

జోసెఫ్ అవినాష్
20 Jul 2026
దేవుని రాజ్యం శక్తి, అధికారం లేదా ఆడంబరంతో కాదు; ప్రేమ, వినయం, సహనం ద్వారా నిశ్శబ్దంగా పెరుగుతుందని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ లియో XIV విశ్వాసులకు పిలుపునిచ్చారు.మత్తయి సువార్తలోని
గోధుమలు – కలుపుగింజలు ఉపమానాన్ని వివరిస్తూ,దేవుడు ప్రపంచంలో తన కార్యాన్ని చిన్న చిన్న మంచి పనులు, ప్రేమతో చేసిన సేవలు,విశ్వాసపూర్వక జీవితం ద్వారా కొనసాగిస్తాడని చెప్పారు.ప్రపంచంలో చెడు కనిపించినప్పటికీ నిరాశ చెందకుండా,దేవుని కార్యంపై నమ్మకంతో ఓర్పుగా నిలవాలని,తీర్పు చెప్పడం కంటే ప్రేమను పంచుతూ సువార్తకు సాక్షులుగా జీవించాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించారు.
