పునీతుల జ్ఞాపకాలతో సువార్తను చాటే అరుదైన మ్యూజియం

జోసెఫ్ అవినాష్
17 Jul 2026
భారతదేశానికి చెందిన కతోలిక గురువులు ఫా. విజయ్ కిరణ్,పునీత జాన్ పాల్ II,కలకత్తా పునీత మదర్ తెరిసా తదితర పునీతుల జీవితాలు,జ్ఞాపకాలను సంరక్షించే ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఈ మ్యూజియం ద్వారా సందర్శకులు పునీతుల జీవితం,వారి విశ్వాస సాక్ష్యం,శ్రీసభకు చేసిన సేవను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.ఇది మాటలతో కాకుండా,పునీతుల జ్ఞాపకాలు,వస్తువులు,చిత్రాల ద్వారా సువార్తను ప్రకటించే "నిశ్శబ్ద సువార్త ప్రచారం" (Silent Evangelization)గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మ్యూజియం భారత కతోలికులకు మాత్రమే కాకుండా,అన్ని మతాల ప్రజలకు స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.
