క్రైస్తవ విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా కర్ణాటక ప్రభుత్వం

జోసెఫ్ అవినాష్

17 Jul 2026

కర్ణాటక ప్రభుత్వం క్రైస్తవ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కోసం 'అరివు' వడ్డీలేని విద్యా రుణ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ పథకం ద్వారా CET, NEET, JEE వంటి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించి,ఇంజినీరింగ్, మెడిసిన్,డెంటల్,ఫార్మసీ,వ్యవసాయం,లా,ఎంబీఏ,ఎంసీఏ వంటి వృత్తిపరమైన కోర్సుల్లో చేరిన క్రైస్తవ విద్యార్థులకు వడ్డీ లేకుండా విద్యా రుణం అందించనుంది.ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులు తమ ఉన్నత విద్యను ఆర్థిక భారం లేకుండా కొనసాగించే అవకాశం పొందనున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN