యేసుక్రీస్తు చేతిలో కొడవలి??? (దర్శ 14:6 - 20)

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
17 Jul 2026
సాదారణ వివరణలో ఈ చిత్రం కడరా తీర్పులోని యేసుక్రీస్తు పాత్రకు సంబంధించినది. దర్శగ్రంథములోని ఈ వచనాలను గమనించండి "అంతట నేను అటు చూడగ అటనొక తెల్లని మేఘము ఉండెను.ఈ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి ఒకడు ఉండెను.ఆయన శిరస్సున సువర్ణము ఉండెను. చేతియందు వాడియైన కొడవలి ఒకటి ఉండెను" (దర్శన 14:14),
ఈ దృశ్యంలో వివరించిన తెలుపు పరిశుద్ధతకు ఆనవాలుగా గుర్తించబడింది. మేఘము, ఆకాశ మండలాన్ని పైనున్న పరలోకాన్ని సూచిస్తుంది,బంగారు కిరీటము ఆయన అత్యున్నత అధికారానికి గురుతు.ఆయన చేతిలోని కొడవలి పదునుగా, వాడి కలిగి ఉంది అని చెప్పటంలో, కోతకు సిద్ధంగా ఉందని రచయిత పరోక్షంగా సూచిస్తున్నాడు.ఇప్పుడు కోతకు రకరకాల పరికరాలు ఉపయోగించినా.. రచయిత కాలం నాటి పరికరం ఇదేనని చెప్పనవసరం లేదు. వంపు తిరిగిన కొడవలి కోయటానికి, కోసిన పంటను ఒకచోట సమకూర్చటానికి ఉపయోగపడుతుంది. అలా సేకరించిన పంటను, కల్లలోకి తీసుకువెళ్ళి ధాన్యాన్ని గడ్డి నుండి వేరు చేయడం ఆనవాయితీ. కొడవలి ఈ రెండు పనులకూ ఉపయోగపడుతుంది. పదునైన కొడవలి కోతకు గురుతు.మంచి మనసు లేనివారికి అది అంతటి శుభవార్త కాదు.బప్తిస్మ యోహాను ఇలాంటి హెచ్చరిక ఒకటి చేశాడు: "మంచి పళ్ళనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును" (మత్తయి 3:10). యేసుక్రీస్తు మాటలలో "మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలలో పడవేయుదురు" (మత్తయి 7:19) దర్శన గ్రంథంలో తప్ప మరెక్కడా కొడవలి ప్రస్తావన కనుపించదు. "అంతలో దేవాలయము నుండి మరియొక దేవమాత వెలువడి మేఘారూధునితో కోతకు పైరు సిద్ధముగానున్నది, నీ కొడవలితో పైరు కోయుము" అని పలికెను. వెంటనే పైరు కోయబడెను (దర్శన 14:15-16). ఇది యోహాను చూసిన స్వప్న దృశ్యం,ఈ దృశ్యంలో కనుపించే మరి రెండు కొడవళ్ళు దేవుని ఆగ్రహానికి చిహ్నంగా చూపబడినవి.మూడవ కొడవలి భూమికి విసరగా అది ద్రాక్షపండ్లను కోని యంత్రములో పడవేసింది. అప్పుడు ఆ యంత్రము నుండి రక్తము వరదలై ప్రవహించినట్లు యోహానుకు స్వప్న దృశ్యంలో కనబడింది.ఇక్కడ దేవుడు తన శత్రువులను హతమార్చడం సంకేతవరంగా చూపబడింది. ఇదేదో భావోద్వేగంతో అప్పటికప్పుడు. చేసింది కాదు. యంత్రాలు, అగ్ని వంటివి చూస్తే శత్రువును హతమార్చేందుకు ఒక ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే మంచి ఉనికి కోసం, న్యాయ సంరక్షణ కోసం, చెడు రూపుమాపుడుతుంది అని అక్కడ అర్ధం స్పురిస్తోంది. మంచిని కోరుకునే దేవుడు ధార్మిక గుణం కలిగినవారు. ఎక్కడయితే ప్రమాదంలో పడతారో, అక్కడ వారి సంరక్షణ కోసం దేవుడు సంసిద్ధుడుగా ఉంటాడని. కూడా అర్థం చేసుకోవచ్చు.
