కన్నీటి ప్రార్థన బలమైనది

జోసెఫ్ అవినాష్

16 Jul 2026

సామాన్య 15వ శుక్రవారం
(మత్తయి 12:1-8)
సువిశేష సారాంశం
నేటి మొదటి ప్రఠనంలో ప్రతి మానవుడు దేవుణ్ణి భక్తితోను చిత్తశుద్ధితోను సేవించాలని హిజ్కియా తెలియజేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుని మనసును కదిలిస్తుంది .ఆయన హృదయం కనికరంతో నిండిపోతుంది తద్వారా దేవుని మహిమ మనిషి యొక్క అవసరాలు తీర్చుటకు సిద్ధంగా ఉంటుందని నేటి మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది. దేవుని సన్నిధిలో నీవు కార్చిన కన్నీరు వృధా కాదు అవి దేవుని సన్నిధిలో నీవు పొందవలసిన మేలులకు మొర పెడతాయని గమనించాలి. హిజ్కియా వలె కన్నీరు కార్చడం అవసరం తద్వారా హృదయాంతరంగాలు దేవుని శక్తితో శుభ్రపరచబడి పవిత్రపరచబడుతుంది. అప్పుడు మన జీవితంలో మేలులు జరగటం ప్రారంభమవుతాయి.హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆయన ఆయువు 15 సంవత్సరాలు పొడిగించడం జరిగింది శత్రువుల భారీ నుండి దేవుడు కాపాడారు. ఒక్కరాయితో రెండు పిట్టలు అన్నట్లు ఏడ్చి అడిగిన తోడనే దేవుని దయార్థ హృదయం కరిగిపోయింది. మంచు వలె కరిగిపోయింది. తక్షణమే దేవుడు మనసు మార్చుకున్నాడు. వరాల వర్షం కురిపించాడు. దేవుని యెడల నమ్మకం,విశ్వాసం కలిగి జీవించడం. బ్రతికి యున్న వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు అన్న సత్యాన్ని గ్రహించుదాం .మృతులు దేవుణ్ణి ఘనపరచలేరు .అందుచేత విశ్రాంతి దినమునకు అధిపతి అయిన దేవుని ఆరాధించుదాం.దేవుని ఉచిత వరములను నిండుగా, మెండుగా పొందుకుందాం.మన నుండి క్రీస్తు ఆశించు ఆ కారుణ్య క్రియా మానవక్షేమమే దేవుడు మనలను దీవించు గాక ఆమెన్..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN