మధ్యప్రదేశ్‌లో కతోలిక పాఠశాలపై మతోన్మాదుల దాడి.. ప్రార్థనా మందిరం, పాఠశాల ఆస్తుల ధ్వంసం

జోసెఫ్ అవినాష్

16 Jul 2026

జూలై 14న మధ్యప్రదేశ్‌లోని ఒక కతోలిక పాఠశాలపై మతోన్మాదులు దాడి చేసి,పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసింది.పాఠశాలలో పనిచేసిన మాజీ ఉద్యోగి,తాను క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని,నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆ ఆరోపణలను ఆధారంగా చేసుకుని పెద్ద సంఖ్యలో వచ్చిన గుంపు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడింది.అయితే పాఠశాల యాజమాన్యం బలవంతపు మతమార్పిడి ఆరోపణలను ఖండిస్తూ,అవి పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించగా,క్రైస్తవ సంఘాలు దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN