శ్రీసభ సమాచార తత్వంపై కొత్త పుస్తకం విడుదల

జోసెఫ్ అవినాష్

16 Jul 2026

ఆధునిక ప్రపంచంలో శ్రీసభ సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి,ఎలా ప్రకటించాలి అనే అంశంపై లోతైన ఆలోచనలకు దారితీసే "The Communication Theology of Avery Dulles" గ్రంథాన్ని జూలై 11న న్యూఢిల్లీలో భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఫా. జాన్ పాల్ హెర్మన్ రచించిన ఈ గ్రంథం,ప్రముఖ జేసుసభకు చెందిన కార్డినల్ ఏవరీ డల్లెస్ బోధనల ఆధారంగా శ్రీసభ సమాచార సేవను కొత్త కోణంలో వివరిస్తుంది.శ్రీసభ స్వరూపం,సువార్త ప్రకటనా బాధ్యత, సంస్కృతి,మాధ్యమాలు,విశ్వాస సమాజం వంటి అంశాలను పరస్పర అనుసంధానంతో వివరించే ఈ పుస్తకం,నేటి సమాచార యుగంలో శ్రీసభ తన సువార్తికరణను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో పీఠాధిపతులు, దైవశాస్త్ర అధ్యాపకులు,మీడియా నిపుణులు, గురువులు, కన్యా స్త్రీలు పాల్గొన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN