పశ్చిమ బెంగాల్‌లో కన్యా స్త్రీల పై బెదిరింపులు.. తీవ్రంగా ఖండించిన భారత కతోలిక లౌకిక సంఘం

జోసెఫ్ అవినాష్
15 Jul 2026
పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో సేల్సియన్ సిస్టర్స్ కాన్వెంట్‌పై జరిగిన గుంపు బెదిరింపులను భారత కతోలిక లౌకిక సంఘం (AICU) తీవ్రంగా ఖండించింది.ప్రభుత్వ అనుమతులతో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం (చాపెల్) మరియు కన్యా స్త్రీల సమాధి స్థలాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ కొందరు కాన్వెంట్‌లోకి చొరబడి కన్యా స్త్రీలను బెదిరించడం మత స్వేచ్ఛపై దాడిగా AICU పేర్కొంది.దశాబ్దాలుగా విద్య,సామాజిక సేవల ద్వారా సమాజానికి సేవలందిస్తున్న సన్యాసినులకు పూర్తి భద్రత కల్పించాలని, ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంఘం కోరింది. వివాదాలను బెదిరింపులు,హింస ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధమైన,శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించాలని కూడా పిలుపునిచ్చింది.
