ఐక్యత, సేవలో ముందుకు సాగండి - పోప్

జోసెఫ్ అవినాష్

13 Jul 2026

ఆసియా ఖండంలోని కతోలికులు ఐక్యత,సోదరభావం మరియు ఆశకు సాక్షులుగా నిలవాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.ఇండోనేషియాలోని జకర్తాలో జూలై 20–26, 2026 మధ్య జరగనున్న ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ సర్వసభ్య సమావేశం సందర్భంగా తన ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కార్డినల్ ఒస్వాల్డ్ గ్రాసియాస్‌కు పంపిన లేఖలో ఆయన ఈ సందేశాన్ని అందించారు.నేటి ప్రపంచంలో ఉన్న విభేదాలు,పేదరికం,సామాజిక అసమానతలు మరియు అనేక సవాళ్ల మధ్య ఆసియా శ్రీసభ ప్రజలకు ఆశను అందించే సాధనంగా ఉండాలని పోప్ కోరారు.దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకుని, ప్రతి నిర్ణయంలో మానవ గౌరవాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని ఆయన సూచించారు.ఆసియా శ్రీసభ కేవలం విశ్వాసాన్ని ప్రకటించే సంఘంగా మాత్రమే కాకుండా,పేదలు,బాధితులు,అణగారిన వారి పట్ల కరుణ చూపే సేవా సమాజంగా ఎదగాలని పోప్ తన లేఖలో పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN