"న్యాయం, నిజమైన ప్రేమ కోసం ఆకలితో వచ్చాను" - పోప్
జోసెఫ్ అవినాష్
13 Jul 2026
ఇటలీలోని కాస్టెల్ గండోల్ఫోలో ఉన్న బోర్గో లౌదాతో సీ కేంద్రంలో సుమారు 200 మంది పేదలు,శరణార్థులు, సామాజికంగా వెనుకబడిన వారితో కలిసి పోప్ లియో XIV జూలై 11న భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన ముందుగా సిద్ధం చేసిన ప్రసంగం లేకుండా మాట్లాడుతూ, "నేను ప్రసంగంతో రాలేదు.న్యాయం కోసం,నిజమైన ప్రేమ కోసం,అందరికీ తలుపులు తెరిచి స్వాగతం పలికే శ్రీసభ కోసం ఆకలితో వచ్చాను"అని అన్నారు.ద్వేషానికి బదులుగా ప్రేమ, విభేదాలకు బదులుగా సయోధ్య, క్షమాపణ,శాంతిని పెంపొందించే సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.పేదరికం,అన్యాయం వంటి సమస్యల మూల కారణాలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోప్ విశ్వాసులకు విజ్ఞప్తి చేశారు.
