దివ్యపూజను కొన్నిసార్లు "వర్షిప్ సర్వీస్" అని ఎందుకంటారు?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం

12 Jul 2026

అర్చనకాండ ప్రధానంగా - దేవుడు ప్రేమతో మన కొరకు నిర్వర్తించే పరిచర్య.తరువాతే అది మనం దేవునికి అర్పించే ఆర్చనం అవుతుంది.ముందుగా తండ్రి దేవుడే పవిత్ర సంకేతాల ద్వారా తనను తాను మనకు సమర్పించుకుంటారు.అదేవిధంగా మనమూ ఎలాంటి మినహాయింపులూ లేకుండా మనల్ని మనం సంపూర్ణంగా తనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుతారు (CCC 1145-1192)

యేసుప్రభువు మనకొరకు తన ప్రాణాలను బలి కావించారు, గనుకనే మనం మన జీవితాలను ఆధ్యాత్మిక బలులుగా ప్రభువుకు సమర్పించగలుగుతాం.దివ్యబలి (దివ్యపూజ) సంస్కారంలో ఇదే జరుగుతుంది. దివ్యపూజలో క్రీస్తుప్రభువు మన కొరకు తనను తాను తండ్రి దేవునికి బలిగా సమర్పించుకుంటారు, తద్వారా మనం కూడ మన జీవితాలను ప్రభువైన దేవునికి కానుకగా అర్పించుకొనే అవకాశం కల్పిస్తారు.ఆవిధంగా మనం క్రీస్తుప్రభువు సమర్పించే లోకరక్షణబలిలో భాగస్వాములం కాగలుగుతాం, మనమూ దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం.అప్పుడు సాక్షాత్తు దేవుడే మనలో జీవిస్తారు,మన జీవితమే తన
జీవితంగా గడుపుతారు..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN