వెనిజులా భూకంప బాధితులకు 14,700 టన్నుల మానవతా సహాయం అందించిన కారిటాస్

జోసెఫ్ అవినాష్

11 Jul 2026

జూన్ 24న వెనిజులాలో సంభవించిన విధ్వంసకర భూకంపాల అనంతరం,కతోలిక సేవా సంస్థ కారిటాస్ వెనిజులా దేశీయ,అంతర్జాతీయ సహకారంతో ఇప్పటివరకు 14,700 టన్నుల మానవతా సహాయ సామగ్రిని స్వీకరించినట్లు వెల్లడించింది.అందులో 9,000 టన్నుల సహాయాన్ని ఇప్పటికే బాధితులకు పంపిణీ చేయగా,మిగిలిన 5,700 టన్నుల సామగ్రిని తదుపరి సహాయక చర్యల కోసం గిడ్డంగుల్లో నిల్వ ఉంచారు.ఈ సహాయక కార్యక్రమాల ద్వారా సుమారు 40,000 మంది భూకంప బాధితులకు ఆహారం, తాగునీరు,మందులు,పరిశుభ్రత సామగ్రి,తాత్కాలిక ఆశ్రయం వంటి అత్యవసర సహాయం అందించబడుతోంది.కారిటాస్ వెనిజులా దేశ ప్రజలు,స్వచ్ఛంద సేవకులు,అంతర్జాతీయ దాతలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN