అగ్ని ప్రమాదానికి గురైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం

జోసెఫ్ అవినాష్
10 Jul 2026
జులై 8న ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సెయింట్ మైఖేల్ బసిలికా అనుమానిత అగ్ని దాడికి గురైంది.దేవుని ప్రధానదూత సెయింట్ మైఖేల్‌కు అంకితమైన ఈ ప్రసిద్ధ గోతిక్ దేవాలయం పరిసర ప్రాంతంలో మంటలు చెలరేగగా,అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో చర్చికి పెద్ద నష్టం తప్పింది. 14వ శతాబ్దం నుంచి అనేక మంది యాత్రికులు,విశ్వాసులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ పవిత్ర స్థలంపై జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కతోలికులు దేవాలయాల రక్షణ కోసం, వాటిని సంరక్షించే వారి కోసం, హృదయ మార్పు కోసం ప్రార్థించాలని పిలుపునిస్తున్నారు.
