ఓటరు జాబితా సవరణలో పాల్గొనాలని బెంగళూరు ఆర్చ్‌బిషప్ పిలుపు

జోసెఫ్ అవినాష్
08 Jul 2026
కర్ణాటకలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి కతోలిక కుటుంబం బాధ్యతగా పాల్గొని,తమ పేరు మరియు వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించాలని బెంగళూరు అగ్ర పీఠాధిపతులు మహా ఘన.పీటర్ మచాడో పిలుపునిచ్చారు.ఓటు వేయడం ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా సమాజం పట్ల ఉన్న నైతిక బాధ్యత కూడా అని ఆయన గుర్తుచేశారు.అందువల్ల ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో చురుకుగా సహకరించి,అవసరమైన వివరాలను సమర్పించి,అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎంతో కీలకమని,ప్రతి విశ్వాసి తన పౌర బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
