నిరుపేదలతో కలిసి భోజనం చేయనున్న పోప్

జోసెఫ్ అవినాష్

08 Jul 2026

వేసవి విశ్రాంతి కోసం కాస్టెల్ గాండోల్ఫోలో ఉన్న పోప్ లియో XIV,రోమ్ నగరంలోని నిరుపేదలతో తన అనుబంధాన్ని చాటుకునే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.జూలై 11న సుమారు 200 మంది నిరుపేదలు,సామాజికంగా వెనుకబడిన వారు,సహాయం అవసరమైన వారితో కలిసి పోప్ భోజనం చేయనున్నారు.పేదలలో క్రీస్తును దర్శించాలనే సువార్త పిలుపును అనుసరిస్తూ,పోప్ లియో XIV తరచూ సమాజంలో అణగారిన వర్గాల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.అధికారిక స్థానంలో ఉన్న వ్యక్తిగా కాకుండా,ఒక ఆధ్యాత్మిక తండ్రిగా వారితో కలిసి కూర్చొని భోజనం చేయడం ద్వారా ప్రతి మనిషి దేవుని దృష్టిలో విలువైనవాడని ఆయన సందేశం ఇవ్వనున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN