కన్నవారి కన్న మిన్న యెవరు?.

డా. కల్లూరి ఆనందరావు
07 Jul 2026
సూక్తులు( జ్ఞాన గ్రంథము)
....................................................
తల్లిదండ్రికన్న తగిన హితులు లేరు!
ఎట్టి కష్టమైన యెఱుక పరచు!
పక్కవారి ముందు పలుచన కాకుమా!
కన్నవారి కన్న మిన్న యెవరు?.
