దైవ సేవకుడు ఫా. సిల్వియో పాస్క్వాలి, PIME వారి 102వ వర్ధంతి

సిస్టర్ రాజకుమారి CSA

07 Jul 2026

"విత్తబడిన విత్తనం మరణించినట్లు కనిపించినా, అది ఎన్నో రెట్లు ఫలించి జీవాన్ని పంచుతుంది."

ఈ సంవత్సరం దైవ సేవకుడు ఫా. సిల్వియో పాస్క్వాలి, PIME వారి 102వ వర్ధంతిని భక్తిపూర్వకంగా స్మరించుకుంటున్నాము. తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసి, సువార్త ప్రకటనే తన శ్వాసగా, ఆత్మల రక్షణనే తన ధ్యేయంగా స్వీకరించిన ఈ మహోన్నత మిషనరీ నేటికీ అనేకమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలను కాలినడకన సందర్శిస్తూ, పేదలను, అణగారిన వారిని ప్రేమతో చేరదీసి, క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేశారు. ఆయన జీవితంలో ప్రార్థన, త్యాగం, వినయం, నిరాడంబరత, అపారమైన దైవప్రేమ మరియు మానవసేవ ఒకే ప్రవాహంగా కలిసిపోయాయి. ఆయన స్థాపించిన పునీత అన్నమ్మ సత్యోపదేశ సభ (Congregation of Catechist Sisters of St. Ann) నేడు ఆయన వెలిగించిన విశ్వాస దీపాన్ని ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు తీసుకెళ్తూ, "క్రీస్తు వెలుగును విస్తరింపజేయడం" అనే తమ ధ్యేయాన్ని విశ్వాసపూర్వకంగా కొనసాగిస్తోంది.

102 సంవత్సరాలు గడిచినా ఆయన నాటిన విశ్వాసపు విత్తనాలు విద్య, ఆరోగ్యం, సువార్త ప్రచారం, సామాజిక సేవల ద్వారా సమృద్ధిగా ఫలిస్తున్నాయి. ఆయన ఆదర్శ జీవితం ప్రతి క్రైస్తవునికీ, ప్రత్యేకంగా అంకిత జీవితాన్ని జీవించే వారికి, దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసంతో, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో సేవ చేయడానికి ఒక శాశ్వత ప్రేరణగా నిలుస్తోంది.

ఈ పవిత్ర సందర్భంగా దైవ సేవకుడు ఫా. సిల్వియో పాస్క్వాలి వారి మధ్యవర్తిత్వం ద్వారా దేవుని అనుగ్రహాలను కోరుతూ, ఆయన ధన్యతా ప్రక్రియ త్వరితగతిన పూర్తికావాలని ప్రార్థిద్దాం. ఆయన చూపిన విశ్వాసం, త్యాగం, సేవామార్గంలో మనమందరం నడుస్తూ క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షులమవుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN