పోప్ ఆదేశాలను ఉల్లంఘించిన నలుగురు బిషప్‌లకు బహిష్కరణ

జోసెఫ్ అవినాష్

07 Jul 2026

సాక్షాత్తు కతోలిక సంఘాన్ని పరిపాలిస్తున్న జగద్గురువులు పోప్ లియో XIV హెచ్చరికలను ధిక్కరిస్తూ, Society of Saint Pius X సభ జూలై 1న స్విట్జర్లాండ్‌లోని ఎకోన్‌లో నలుగురు నూతన పీఠాధిపతులను పోప్ అనుమతి లేకుండా నియమించింది.దీనిని కతోలిక సంఘ ఐక్యతకు తీవ్రమైన విఘాతంగా పరిగణించిన వాటికన్,ఈ నియామకాల్లో పాల్గొన్న పీఠాధిపతులను మరియు వారిని నియమించిన పీఠాధిపతుల సమాఖ్యను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రకటిస్తూ వారిని శ్రీసభ విధుల నుండి బహిష్కరించింది.అలాగే రెండవ వాటికన్ మహాసభ సంస్కరణలను తిరస్కరిస్తూ,లాటిన్ ఆరాధన విధానాన్నే అనుసరిస్తున్న ఈ సభతో గతంలో సయోధ్య ప్రయత్నాలు జరిగినప్పటికీ, తాజా పరిణామాలతో వాటికన్ అత్యంత కఠిన చర్యలు తీసుకుంది. అలాగే Society of Saint Pius X సభను కతోలిక సంఘం నుంచి విడిపోయిన విభేదక సభగా వాటికన్ అధికారికంగా ప్రకటించింది.అలాగే ఈ సభ నిర్వహించే దివ్యబలిపూజల్లో విశ్వాసులు పాల్గొనకూడదని, వీరు నిర్వహించే దివ్య సంస్కారాలు చెల్లవని వాటికన్ ప్రకటించింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN