అమెరికా శ్రీసభ దివ్యసత్ప్రసాద భక్తిలో మరింత ఎదగాలి - పోప్
జోసెఫ్ అవినాష్
06 Jul 2026
జూలై 5న అమెరికాలో జరిగిన జాతీయ దివ్యసత్ప్రసాద తీర్థయాత్ర ముగింపు సందర్భంగా వీడియో సందేశం అందించిన విశ్వ కాపరి పోప్ లియో XIV,దివ్యసత్ప్రసాదం
పట్ల ఉన్న విశ్వాసం అమెరికా కతోలిక శ్రీసభను మరింత సువార్త ప్రచారానికి,సమాజసేవకు నడిపించాలని ఆకాంక్షించారు.క్రీస్తు నిజమైన సన్నిధి అయిన దివ్యసత్ప్రసాదం నుంచి శక్తిని పొందుతూ,విశ్వాసులు ఐక్యత, ప్రేమ,సేవా భావాలతో జీవించాలని ఆయన ప్రోత్సహించారు. దివ్యసత్ప్రసాదం కేవలం వ్యక్తిగత భక్తికే పరిమితం కాకుండా,పేదలు, బాధితులు, అణగారిన వారిపట్ల కరుణతో స్పందించే జీవితానికి మూలాధారమని పేర్కొన్నారు. అలాగే అమెరికా కతోలికుల బలమైన దివ్యసత్ప్రసాద
వారసత్వాన్ని గుర్తుచేస్తూ,ఈ తీర్థయాత్ర దేశమంతటా ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దోహదపడాలని,క్రీస్తు సన్నిధి ద్వారా సమాజంలో ఆశ,శాంతి,ఐక్యత మరింత విస్తరించాలని ఆయన ప్రార్థించారు.
