యుద్ధాల మధ్య క్రీస్తే మన ఆశ – పోప్
జోసెఫ్ అవినాష్
05 Jul 2026
సామాన్య 14వ ఆదివారాన్ని పురస్కరించుకొని విశ్వ కాపరి పోప్ లియో XIV తాను అందించిన సువిశేష సందేశంలో ప్రపంచాన్ని వేధిస్తున్న యుద్ధాలు,బాధలు,పాపం, అన్యాయాల మధ్య క్రీస్తే నిజమైన ఆశ అని విశ్వాసులకు గుర్తుచేశారు.మన జీవిత భారాన్ని మనం ఒంటరిగా మోయడం లేదని,ప్రభువైన యేసు స్వయంగా మనతో కలిసి ఆ భారాన్ని మోస్తున్నారని ఆయన చెప్పారు.సిలువ అనేది బాధకు చిహ్నం మాత్రమే కాదని,అది ప్రేమ,విమోచనం, స్వేచ్ఛకు దారితీసే మార్గమని వివరించారు.“బానిసత్వంలో క్రీస్తు విముక్తి,యుద్ధాల మధ్య క్రీస్తు ఆశ,పాప సమయంలో క్రీస్తు క్షమాపణ” అని పేర్కొంటూ,అవతార రహస్యంలోని వినయమే దేవుని నిజమైన జ్ఞానమని,భారాలతో అలసిపోయిన ప్రతి ఒక్కరినీ యేసు తనవద్దకు ఆహ్వానిస్తున్నారని పోప్ విశ్వాసులను ప్రోత్సహించారు.
