పోప్ లియో XIVకు ప్రతిష్ఠాత్మక 'లిబర్టీ మెడల్' పురస్కారం

జోసెఫ్ అవినాష్

04 Jul 2026

ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ,మానవ గౌరవం,మనస్సాక్షి స్వేచ్ఛ పరిరక్షణకు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా విశ్వ కాపరి పోప్ లియో XIVకు అమెరికాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ప్రతిష్ఠాత్మక లిబర్టీ మెడల్ ప్రదానం చేసింది.అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన ఈ వేడుకలో వీడియో సందేశం ద్వారా పాల్గొన్న పోప్,మానవ గౌరవం,సమానత్వం, స్వేచ్ఛ,న్యాయం,శాంతి వంటి స్థాపక విలువలను ఎల్లప్పుడూ కాపాడాలని పిలుపునిచ్చారు.అలాగే,గర్భధారణ క్షణం నుంచి సహజ మరణం వరకు ప్రతి మానవ జీవితం పవిత్రమైనదని పునరుద్ఘాటిస్తూ,బలహీనులు,వలసదారులు,అవసరంలో ఉన్న వారిని ఆదరించే సమాజమే నిజమైన స్వేచ్ఛకు, న్యాయానికి ప్రతీక అని పేర్కొన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN