జూలై నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
03 Jul 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV జూలై 2026 నెలకు తన ప్రార్థన ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తూ,"ప్రతి మానవ జీవితం పట్ల గౌరవం" కోసం విశ్వాసులందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు.గర్భధారణ ప్రారంభం నుండి సహజ మరణం వరకు ప్రతి మానవ జీవితం దేవుని అమూల్యమైన వరమని గుర్తించి,ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకమైన, పునరావృతం కాని విలువను గుర్తించి రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అనారోగ్యంతో ఉన్నవారు,వృద్ధులు, బలహీనులు,ఇంకా జన్మించని శిశువులు సహా ప్రతి మనిషిని ప్రేమతో,కరుణతో,గౌరవంతో ఆదరించాలని ఆయన కోరారు. ప్రతి జీవితం దేవుని ప్రతిరూపమని గుర్తిస్తూ,జీవిత పవిత్రతను కాపాడే సమాజాన్ని నిర్మించేందుకు ఈ నెలలో ప్రత్యేకంగా ప్రార్థించాలని పోప్ పిలుపునిచ్చారు.
