ఘనముగా జరిగిన నూతన పీఠాధిపతుల అభిషేక మహోత్సవం

జోసెఫ్ అవినాష్

03 Jul 2026

వరంగల్ పీఠం, ఫాతిమామాత బృహదేవాలయ ప్రాంగణంలో నూతనముగా వరంగల్ పీఠానికి 4వ పీఠాధిపతిగా ఎన్నికైన మహా ఘన. దుగ్గింపుడి విజయ పాల్ గారి పీఠాధిపత్య మహోత్సవ కార్యక్రమం ది.3-07-2026 న కన్నుల పండుగగా జరిగింది. ఈ అభిషేక మహోత్సవానికి ప్రధాన అభిషేక పీఠాధిపతులు హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహా ఘన. కార్డినల్ పూల అంతోని గారు, విశాఖ అగ్ర పీఠాధిపతులు మహా ఘన. ఉడుమల బాల గారు, శ్రీకాకుళం పీఠాధిపతులు మహా ఘన. రాయరాల విజయకుమార్ గారు, ఏలూరు పీఠాధిపతులు మహా ఘన.పొలిమేర జయరావు గారు, తెలుగు రాష్ట్ర పీఠాధిపతులు, ఇతర రాష్ట్ర పీఠాధిపతులు, వరంగల్ పీఠ వికర్ జనరల్స్, వివిధ మఠ సంస్థలకు చెందిన గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవ విశ్వాసులు ఈ పీఠాధిపత్యం మహోత్సవపు దివ్యబలిపూజలో పాల్గొని ప్రత్యేక విధంగా ప్రార్థించారు. నూతనంగా ఎన్నిక కాబడిన పీఠాధిపతులకు శుభాకాంక్షలు తెలియపరిచారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN