భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

03 Jul 2026

క్రైస్తవత్వ మహత్వం
*****"""*******"**"
ప్రేమ సేవ త్యాగ మనెడి మతము క్రైస్తవత్వము
'తోమాస 'నెడి క్రీస్తు శిష్యు డొచ్చె భరత దేశము
స్వామి యేసు గూర్చి అంత చెప్పినాడు జనులకు
తామసాలు వదలమనుచు దైవ ప్రేమ పంచెను!

భరత దేశమందు నాడు వెలసె క్రీస్తు సంఘము
తర తరముల సేవ తోడ వాసి కెక్కె నిరతము
గురు తరమగు బాధ్యతలను నిర్వహించి గురువులు
వరము లొసగు గుడుల బడుల నెన్నొ తీర్చి దిద్దిరి!

నాడు ప్రజలు అగ్ర,నిమ్న వర్గములుగనుండిరి
పాడు వాడ లందు దళితులైన వారి నుంచిరి
వాడ లందు నున్న జనుల 'పంచము'లని పిలిచిరి
గూడు, గుడ్డ, విద్య వారి కందకుండ చేసిరి!

నేను నువ్వు వేరు కాదు అందరిమిల నొక్కటే
మానవత్వమే మతమను క్రీస్తు గొప్ప బోధనం
మనుషులందు దేవుడుండు ననెడి దివ్య తత్త్వము
ఘనము గాను వ్యాప్తి చెంది మంచి నంత నింపెను

గుడుల చెంత విద్య, వైద్య ఆలయాలు నిర్మించి
బడుగు వారి కెపుడు అండ దండ గాను నిలుస్తూ
దడులనేవి జనుల మధ్య ఉండ కుండ జేయుచు
అడుగడుగున భక్తి శక్తి నందించెను క్రైస్తవం!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN