గూగుల్‌లో ఉన్నత ఉద్యోగాన్ని విడిచిపెట్టి గురువైన యువకుడు

జోసెఫ్ అవినాష్
03 Jul 2026
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలి,దైవ పిలుపుకు స్పందించి కతోలిక గురువుగా మారిన ఫాదర్ ఎరిక్ పింటార్ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నప్పటికీ, తన ప్రతిభతో సాంకేతిక రంగంలో విశేష విజయాలు సాధించిన ఆయన,అనంతరం దైవ సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.ఇటీవల గురువుగా అభిషేకం పొందిన ఆయన,అమెరికాలోని చెవిటి కతోలికుల కోసం సేవ చేస్తున్న అరుదైన యాజకుల్లో ఒకరిగా నిలిచారు. భౌతిక సంపద,ఉన్నత ఉద్యోగం కంటే దేవుని చిత్తాన్ని అనుసరించడం గొప్పదనే సందేశాన్ని ఆయన జీవితం స్పష్టంగా తెలియజేస్తోంది.
