భారత క్రైస్తవ దినోత్సవం (జూలై 3)

జోసెఫ్ అవినాష్

02 Jul 2026

ప్రభుయేసు అంతిమ సందేశాన్ని అనుసరించి పునీత తోమాసు గారు, పునీత ఫ్రాన్సిస్ శౌరీ గారలు మన భారతదేశం ఏతెంచి,మనకు క్రీస్తుప్రభుని బోధలను అందించి, దైవరాజ్య విలువలతో,మంచి విశ్వాసముతో నిండిన భారత శ్రీసభను స్థాపించారు.వారి అడుగు జాడలలో ఎందరో విదేశీ సువార్తా బోధకులు విచ్చేసి,శ్రీసభను సుస్థిర పరచారు.క్రమేణా స్థానిక భారతీయులే శ్రీసభ సంరక్షకులుగా, బోధకులుగా ఎదిగారు.

ఎందరో పుణ్యశీలురు తమదైన విశిష్ట శైలిలో యేసుప్రభుని శిష్యరికం చేసి శ్రీసభ మనుగడకు, వ్యాప్తికి తమ వంతు ప్రయత్నించి,భారతీయ కతోలిక చరిత్రలో ఆణిముత్యాలుగా చిరంజీవులై నిలిచారు.అట్టి వారిలో కొందరిని కతోలిక శ్రీసభ దైవ సేవకులు,ధన్యులు, పూజ్యులు,పునీతులుగా ప్రకటించి, క్రైస్తవులకు ఆదర్శంగా నిలిపింది. ఈరోజు పునీత తోమా గారి పండుగ. తోమా గారి పండుగను మనం భారత శ్రీసభ పుట్టినరోజుగా, భారత క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటాం. భారత శ్రీసభ అభివృద్ధికి బాటలు వేసిన ధన్యాత్ములను స్మరించుకుంటూ, అందరికీ శుభాకాంక్షలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN