వెనిజులా భూకంప బాధితుల కోసం సీసీబీఐ ప్రార్థనలు

జోసెఫ్ అవినాష్
01 Jul 2026
భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య జూన్ 24న వెనిజులాలో సంభవించిన విధ్వంసకర భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రజల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని,ఆధ్యాత్మిక సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.వెనిజులా పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు మహా ఘన జీసస్ ఆండోని గొంజాలెస్ డే జరాటే సలాస్కు పంపిన సందేశంలో,ప్రాణనష్టం,గాయాలు, భారీ విధ్వంసం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ,భారత కతోలిక సంఘం నిరంతరం వెనిజులా ప్రజల కోసం ప్రార్థిస్తుందని తెలిపారు.రక్షణ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులకు దేవుడు బలం ప్రసాదించాలని, దుఃఖిత కుటుంబాలకు ఓదార్పు, గాయపడిన వారికి స్వస్థత, నిరాశ్రయులకు ఆశను ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే వెనిజులా పరిరక్షకురాలైన ఆవర్ లేడీ ఆఫ్ కొరోమోటో వారి మధ్యవర్తిత్వం ద్వారా దేశానికి శాంతి, ధైర్యం, ఓదార్పు కలగాలని ఆకాంక్షించారు.
