నైజీరియాలో మరో దారుణం: ఉగ్రదాడిలో 22 మంది క్రైస్తవుల హత్య

జోసెఫ్ అవినాష్

01 Jul 2026

నైజీరియాలోని ప్లాటో రాష్ట్రంలోని జురాక్ (Jebbu Binde) క్రైస్తవ గ్రామంపై జూన్ 27 అర్ధరాత్రి జరిగిన దారుణ ఉగ్రదాడిలో ఒక పాస్టర్‌తో సహా 22 మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. దుండగులు గ్రామంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, ఇళ్లకు నిప్పంటించడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. దాడి దాదాపు రెండు గంటలపాటు కొనసాగినప్పటికీ భద్రతా బలగాలు ఆలస్యంగా చేరుకోవడంతో ప్రాణనష్టం మరింత పెరిగిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన నైజీరియాలో క్రైస్తవులపై కొనసాగుతున్న హింసకు మరో విషాద ఉదాహరణగా నిలిచింది. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని, దేశంలో మతపరమైన హింసను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘ నాయకులు మరియు మానవ హక్కుల సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN