FCRA సవరణలపై దేశవ్యాప్తంగా కతోలికుల ఆందోళన

జోసెఫ్ అవినాష్
30 Jun 2026
భారత ప్రభుత్వం ప్రతిపాదించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు–2026పై ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా కతోలికులు జూన్ 28న ప్రత్యేక ప్రార్థనలు, దివ్య సత్ప్రసాద ఆరాధన,జపమాల మరియు స్వచ్ఛంద ఉపవాసం నిర్వహించారు.ఈ సవరణలు అమలులోకి వస్తే శ్రీసభ నిర్వహిస్తున్న విద్య,వైద్యం,సామాజిక సేవా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య హెచ్చరించింది.ప్రార్థనతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేయాలని విశ్వాసులను పిలుపునిస్తూ,దేశ శ్రేయస్సు, ప్రజాప్రతినిధుల జ్ఞానం మరియు శ్రీసభ సేవా స్వేచ్ఛ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరింది.
