నేటి పునీతులు : రోమునగర శ్రీసభలో మొదటి వేదసాక్షులు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

30 Jun 2026

శ్రీసభకు మూలస్థంభాలైన పునీత పేతురు, పునీత పౌలు గార్ల పండుగ తరువాత అదే పునాది పై పేర్చబడి నిర్మంపబడిన శ్రీసభభవనానికి రాళ్లు రక్తతర్పణ చేసిన మన వేదసాక్షులు, పునీత మహనీయులు. వీరు పదులు వందల్లో కాదు వేల సంఖ్యలో ఉన్నారు. మహావిలువైన వారి ప్రాణాల్ని తృణప్రాయంగా మనకోసం మన శ్రీ సభకోసం మన ప్రపంచంకోసం ఫణంగా పెట్టారు. స్త్రీలు పురుషులు, బాలురు బాలికలు, యువజనులు వృద్ధులు, పండితులు పామరులు ఎందరో ఇలా క్రీస్తుకోసం బలిదానమయ్యారు.

మొదట్లో రోము సామ్రాజ్యంలో మొత్తము 9 సార్లు వేదహింసలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. క్రీ॥ శ|| 64లో రోమునగరం పెద్దమంటల్లో చిక్కుకుంది. క్రూరుడును, విలాసలాలసుడైన నీరో చక్రవర్తె ఇందుకు కారణమని ఎక్కువమంది రోమనులు భావించారు. అయితే స్వీయరక్షణకోసం నీరో చక్రవర్తి ఆ దురాగతం క్రైస్తవ సమాజం వల్లే కలిగిందని ఆ నెపం అమాయకులైన క్రైస్తవుల పై నెట్టివేశాడు. తాను మాత్రం ఏమీ చేతకానివాడిలా కార్యశూన్యుడై నిమ్మకు నీరెత్తినట్లు ఫిడేలు వాయించుకుంటూ పాటలు పాడుకున్నాడు. “రోము తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు" అనే సామెత అందుకే పుట్టుకొచ్చింది.

ఇక క్రీ||శ|| 95లో డొమిషియన్ చక్రవర్తి క్రైస్తవం పుచ్చుకున్నా లేక అనుసరించినా నేరం అన్నట్లు శాసనంచేసి క్రైస్తవుల్ని రాక్షసుడులా పీడించాడు. క్రూరంగా చంపి రక్తం పారించాడు. పిమ్మట సరిగ్గా మరో పండ్రెండేళ్లకు అనగా క్రీ||శ|| 107లో ట్రాజన్ చక్రవర్తి క్రైస్తవుల పై గంగ వెర్రులెత్తాడు. తొలినాటి విశ్వాసుల ప్రగాఢనమ్మకాన్ని, ఆ పేక్షను, ప్రేమను వర్ణింపశక్యంకానంత ఇదిగా పరీక్షించాడు. జైలు, అగ్ని, కత్తి, ప్రమాణం వంటి ఆయుధాలతో చిత్రహింసలు పెట్టాడు. పశుపక్ష్యాదుల పై చూ జాలిలో కొంతైనా చూపలేకపోయాడు. పోతే క్రీ|| శ|| 135లో హెడియన్ చక్రవర్తి క్రీ||శ|| 180లో మార్కుస్ అవురేలియస్ చక్రవర్తి అదే రాక్షసబాటలో నడిచారు.

మరో 42సం||ల అనంతరం క్రీ||శ|| 222లో సెప్టెమస్ సెవెరస్ చక్రవర్తి క్రైస్తవులకు తమ మతం పై ఎంత నిశ్చలత, స్థిరత్వం ఉందో తనశక్తి కొలది హింస దౌర్జన్యాలతో పరీక్షించాడు. బాల్య శ్రీసభ గొట్టెలను, కాపరులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నాడు. ఇతగాడి అనంతరం క్రీ||శ|| 257లో వలేరియన్ చక్రవర్తి, క్రీ||శ|| 303లో డియో క్లేషియన్ చక్రవర్తి తమ శక్తివంచన లేకుండా కృషిచేసి అమాయక క్రైస్తవాళిని గడగడలాడించారు. విగ్రహారాధన ప్రోత్సహించి, సృష్టి వస్తువులను మొక్కమని అందుకు సిద్ధపడని క్రైస్తవులను దఫాలవారీగా కష్టాలకు గురిచేసి అప్పటికీ క్రైస్తవం విడిచి పెట్టనివారిని ఈ లోకమే విడిచి పెట్టేలా రక్తపాత శిక్షలు విధించి వికటాట్టహాసం చేశాడు. మానవతను మంటగలిపాడు.

ఈ విధంగా దాదాపు 25సం||ల సుదీర్ఘకాలం క్రైస్తవం అనేక ఆటుపోట్లు, అల్లకల్లోలాలు ఎదుర్కొని నిలబడింది. తమ శరీరాలు, రక్త ప్రాణాలు, విశ్వాస విధేయతలతో శ్రీసభ భవన నిర్మాణం చేశారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతం లోకాంత్యమే కావచ్చు. అయితే అనేక శోధనలు, పరీక్షలు, శిక్షలు అనంతరం క్రీ|| శ|| 314లో శ్రీ సభకు మంచిరోజులు వచ్చాయి. కాన్స్టాంటైన్ చక్రవర్తి రోము పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన ఆయనభార్య శ్రీసభకు ఆప్తులయ్యారు, అభిమానించారు. క్రైస్తవ మతంను రోము సామ్రాజ్య అధికారమతంగా సవినయంగా ప్రకటించాడు. దీనినే మిలాను శాసనం అంటారు. తను భౌతిక పరమైన రాజ్యప్రజాపాలన, సంరక్షణ పరిరక్షింపగా, పరిశుద్ధ పోపుగారు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రజల ఆథ్యాత్మిక మరియు ఆత్మ సంరక్షణ బాధ్యతలు సక్రమంగా జరిగాయి. ఆరోజు రోమను (కతోలిక) శ్రీసభ గురువులు తెల్లని పూజావస్త్రాలు ధరించి బలిపూజ నర్పించారు. దర్శనాగ్రంథం 7:13-17 వరకు బైబులు గ్రంథవాక్యాన్ని మననం చేసుకున్నారు. ఆనాటి బలిపూజలో స్మరింపబడిన వేదసాక్షులు పునీతులు పూనాదిరాళ్లుగా పేర్కొనబడ్డారు. ప్రపంచమంతా నమ్మేది ఆకాశంలో ఎగిరే
నేరవేరుతుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN