ప్రేమతో కూడిన ఐక్యతకు పేతురు, పౌలు ఆదర్శం: పోప్

జోసెఫ్ అవినాష్
29 Jun 2026
పునీతులైన పేతురు,పౌలు అపొస్తలులు స్వభావం,నేపథ్యం, జీవన అనుభవాల్లో ఎంతో భిన్నంగా ఉన్నప్పటికీ, పవిత్ర ఆత్మ వారిని క్రీస్తులో ఒకటిగా చేసి శ్రీసభ మేలుకోసం ఉపయోగించాడని పునీత పేతురు, పౌలుల మహోత్సవం సందర్భంగా తాను అందించిన పండుగ సందేశంలో పోప్ తెలిపారు.నేటి ప్రపంచంలో విభజనలు,భిన్నాభిప్రాయాలు పెరుగుతున్న వేళ,క్రైస్తవులు కూడా పరస్పర గౌరవం,ప్రేమ, విశ్వాసంతో ఐక్యంగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజమైన ఐక్యత అనేది అందరూ ఒకేలా ఉండటంలో కాదు; భిన్నత్వాన్ని దేవుని వరంగా స్వీకరించి,క్రీస్తులో ఒక్క కుటుంబంగా సాక్ష్యమివ్వడంలో ఉందని పోప్ స్పష్టం చేశారు.
