"నిజమైన ప్రేమకు త్యాగం, స్వార్థత్యాగం మరియు ఆతిథ్య హృదయం అవసరం" - పోప్
జోసెఫ్ అవినాష్
29 Jun 2026
యేసుక్రీస్తును నిజంగా ప్రేమించి ఆయన శిష్యులుగా జీవించాలంటే ప్రేమకు మూడు ముఖ్య లక్షణాలు అవసరమని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ చెప్పారు: స్వార్థ బంధాల నుండి విముక్తి (Detachment),త్యాగాన్ని అంగీకరించడం (Loss),మరియు ఆతిథ్యం (Hospitality).క్రీస్తు ప్రేమ మన సంబంధాలకు నిజమైన పరిపూర్ణతను ఇస్తుందని,అందుకే కొన్నిసార్లు మన స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల మేలు కోసం జీవించాల్సి ఉంటుందని వివరించారు.అలాగే,దాహంతో ఉన్నవారికి ఒక గ్లాసు నీరు ఇవ్వడం వంటి చిన్న ప్రేమపూర్వక కార్యాలు కూడా దేవుని దృష్టిలో గొప్పవేనని చెప్పారు.యేసు నామంలో వచ్చే ప్రతి వ్యక్తిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు,మనం వారిని మాత్రమే కాదు,క్రీస్తునే మరియు ఆయనను పంపిన పరలోక తండ్రినే ఆహ్వానిస్తున్నామని పోప్ గుర్తుచేశారు.
