యుద్ధాన్ని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించడు - పోప్

జోసెఫ్ అవినాష్
27 Jun 2026
జూన్ 26న వాటికన్ వేదికగా కార్డినల్స్ తో సమావేశమైన పోప్ ప్రపంచ శాంతికి హృదయపూర్వక పిలుపునిచ్చారు. "యుద్ధం మానవత్వానికి ఎన్నటికీ తగినది కాదు; దానిని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించడు.అత్యాధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ,సంఘర్షణలను మృగాల్లా కాకుండా, మనుషులుగా పరిష్కరించేందుకు దేవుడు మనకు బుద్ధిని, స్వేచ్ఛను ప్రసాదించాడు" అని ఆయన అన్నారు.అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మానవ గౌరవం, న్యాయం,ఐక్యత మరియు శాంతిని కాపాడే బాధ్యతను క్రైస్తవులు ధైర్యంగా నిర్వర్తించాలని ఆయన కార్డినల్స్‌ను ప్రోత్సహించారు.
